Wednesday, October 15, 2014

Saturday, May 7, 2011

MY BROTHER
is Special
My smile perfectly reflects
the joy you spread
My strength, I gather from
hopeful words you said


You are the Door
I can knock any time
My pillar of strength,
each and every time.

( a beautiful gift presented by my sis..)

Wednesday, January 13, 2010


ముత్యాల ముగ్గులు, రతనాల బొమ్మలు
చెమ్మ చెక్క, చెమ్మ చెక్క
నవరత్న సంక్రాంతి
చేరడేసి మొగ్గ
శతమానం భవతి:

ఈ సంక్రాంతి అందరి జీవితాలలొ
నవ్వుల పూవులు విరబూయాలని,
దూరాలను చేరువ చేస్తూ
హ్రుదయ భారాలను తొలగించి
నవ వసంతం దిగంతాల వరకు
వ్యాపించాలని అశిస్తూ
సంక్రాంతి శుభాకాంక్షలు..

Friday, August 28, 2009

కృష్ణ శాస్త్రి

నా మందిర గవాక్షం నుండి తొలి అరుణ స్వర్ణకాంతి వచ్చి
నా కళ్ళను తాకినపుడు కళ్ళు విప్పి స్వాగతం చెపుతాను

వేకువ గాలి వ్రేళ్ళతో
నా మొగము నిమిరినప్పుడు చిరునవ్వు నవ్వుతాను

పెరటిలోనుండి క్రొత్తగా విరిసిన విభాత సుమ
పరిమళం వచ్చి పలకరిస్తే ఔనని తలూపుతాను

కానీ, గవాక్షంలోనికి రవ్వంత ఒదిగిన
మావి కొమ్మ చివర నిలిచి
'కో' అన్న వన ప్రియ రావానికి
బదులు చెప్పలేను
ఇక బదులు మాత్రం చెప్పలేను

---- కృష్ణ శాస్త్రి

( after an operation when he lost his voice)
చిన్న నాటి నుండి అద్బుతమైన రస స్పందన కలిగించిన ఎన్నో పాటలు (నేలతో నీడ అన్నది నను తాకరాదని, ఇది మల్లెల వేళ అని వెన్నల మాసమని, ఆకులో ఆకునై ....) నాకు భావ కవితలంటే మక్కువ కలిగేలా చేసాయి. నాకు నచ్చిన ఎన్నోపాటల రచయిత శ్రీ దేవులపల్లి వారని ఆనాడు తెలియకపొయినా ... తరువాత కాలంలో భావ కవితకు చిరునామగా ఆయన పీరు నా హ్రుదయంలో స్తిర పడింది.మావి చిగురులు తింటూ మధురంగా మనల్ని పలకరించే గండు కోయిలలా తియ్యని కవితలు (ఊర్వశి , కృష్నపక్షం..) మనకు అందించిన ఆ కవి శిఖామని తన స్వరాన్ని కేన్సర్ మహమ్మరికి కోల్పొయిన తరువాత వ్రాసిన ఈ కవిత మానవత్వం ఉన్న ప్రతి వారిని కదిలిస్తుంది.
 

నేటివరకు విచ్చేసిన అతిధులు

Free Hit Counter